Thammudu: అక్క మాట కోసం తమ్ముడి యుద్ధం

రాబిన్‌హుడ్(Robinhood) సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin). దీంతో నితిన్ తన ఆశలన్నింటినీ తన తర్వాతి సినిమా తమ్ముడు పైనే పెట్టుకున్నాడు. వేణు శ్రీ రామ్(Venu Sri Ram) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వాస్తవానికైతే ఇప్పటికే రిలీజ్ అవాల్సింది.
కానీ రాబిన్‌హుడ్ వల్ల తమ్ముడు(Thammudu) వాయిదా పడి జులై 4కు రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. 2.38 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ మొత్తం యాక్షన్, ఎమోషన్స్ తో నిండిపోయింది. అక్క ఇచ్చిన మాటను నెరవేర్చే తమ్ముడి కథగా ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
చూస్తుంటే సినిమాలోని అక్కా తమ్ముడు సెంటిమెంట్ కు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నట్టు అనిపిస్తుంది. అజనీష్ లోక్‌నాథ్(Ajanessh Loknath) బీజీఎం ట్రైలర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా అయినా నితిన్ కు మంచి విజయాన్ని అందించి అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.