బాబీ తర్వాత వారితోనే బాలయ్య
అఖండ నుంచి తన తర్వాతి సినిమాల డైరెక్టర్ల విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. తను ఎంచుకున్న డైరెక్టర్లు కూడా బాలయ్య తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని మంచి విజయాలందించారు. తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా మంచి హిట్ అవడంతో తన తర్వాతి సినిమాపై అంచనాలు పెరిగాయి.
బాలయ్య తర్వాతి సినిమాను డైరెక్టర్ బాబీతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా తెరకెక్కబోతుంది. దాని తర్వాత బాలయ్య ఎవరితో చేస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా ఆల్మోస్ట్ వీళ్లే అంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. బాబీ తర్వాత బాలయ్య తన 110వ సినిమాను బోయపాటి శ్రీనుతో చేయనున్నట్లు తెలుస్తోంది.
అది కూడా అఖండ2 అనే సమాచారం. అఘోర క్యారెక్టర్ ను ఈ సినిమాలో కొనసాగించడంతో పాటూ పొలిటికల్ టచ్ తో ఈ సినిమాను బోయపాటి తెరకెక్కించనున్నాడు. మూవీ సెట్స్ పైకి వెళ్లేనాటికి ఏమైనా మార్పులు జరిగితే జరగొచ్చు. ఆ తర్వాత 111వ సినిమాగా తనకు వీర సింహారెడ్డి లాంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో ఉండొచ్చట.
ప్రస్తుతం రవితేజతో సినిమా చేస్తున్న గోపీచంద్, ఆ సినిమా తర్వాత బాలయ్యతో కలిసి మూవీ చేయనున్నాడట. వీళ్లు కాకుండా సుకుమార్ తో కూడా ఓ సినిమా చేయాలని బాలయ్య చూస్తున్నాడట. మరి ఇదెంత వరకు సాధ్యపడుతుందో చూడాలి. చూస్తుంటే బాలయ్య ఈ వయసులో కూడా మరో మూడేళ్లకు సరిపోయే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడని అర్థమవుతుంది.













