యంగ్ డైరెక్టర్లపై కన్నేసిన బాలయ్య
అఖండ తర్వాత బాలయ్య దిశ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఏ సీనియర్ హీరో ఎంజాయ్ చేయని సక్సెస్ ను బాలయ్య టేస్ట్ చేస్తున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు. దీంతో బాలయ్యతో సినిమాలు చేయడానికి పలు డైరెక్టర్లు, నిర్మాణ సంస్థలు వెయిట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత తను చేయబోయే సినిమాల కోసం కొందరు యంగ్ డైరెక్టర్స్ తో బాలయ్య డిస్కషన్స్ చేస్తున్నారని సమాచారం.
ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ తో సినిమాను బాలయ్య రెండేళ్ల కిందటే అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు ఆయనే స్వయంగా స్టోరీ కూడా రెడీ చేస్తున్నానని, కుదిరితే తన దర్శకత్వంలోనే సినిమా తెరకెక్కుతుందని చెప్పాడు. కానీ బాలయ్య ఇప్పుడా బాధ్యతను యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ చేతిలో పెట్టాడని, మైత్రీ మూవీ మేకర్స్ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయనుందని అంటున్నారు.
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అన్స్టాపబుల్ షో కోసం ప్రశాంత్ వర్మ తో బాలయ్య పని చేశాడు. తప్పకుండా సినిమా చేద్దామని బాలయ్య ప్రశాంత్ తో అన్నాడట. జై హనుమాన్ తర్వాత వీరి కాంబోలో సినిమా ఉండే ఛాన్సుంది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నాడని టాక్. వీరితో పాటూ వెంకటేష్ మహా లాంటి యంగ్ డైరెక్టర్లు కూడా బాలయ్యతో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు అనిల్ రావిపూడి, బోయపాటి కూడా బాలయ్యతో సినిమాలు చేయడానికి లైన్ లో ఉన్నారు.













