నెపోటిజంకు కొత్త మీనింగ్ చెప్పిన బాలయ్య
బాలీవుడ్ లో నెపోటిజం గురించి ఏ రేంజ్ లో చర్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కడితో పోలిస్తే టాలీవుడ్ లో మాత్రం ఆ చర్చ ఎక్కువగా జరగదనే చెప్పాలి. దానికి కారణం స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకున్నవాళ్లే. అందుకే ఇక్కడ నెపోటిజం అనే పేరు ఎక్కువ వినిపించదు. అయితే రీసెంట్ గా జరిగిన సత్యభామ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో బాలయ్య నెపోటిజం గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు.
తెలుగు సినిమా గొప్పదనం గురించి చెప్తూ, వారసత్వం అంటే ఎన్టీఆర్ పేరు చెప్పడమో, ఆయన గొప్పతనాన్ని చెప్పడమో కాదని, ఆయన వేసిన బాటలో నడుస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడమని.. ఆ లెగసీని కాపాడుకోవడానికి ఎంత కష్టపడాలో అన్న రీతిలో చాలా ప్రత్యేకంగా నొక్కి మరీ చెప్పాడు నందమూరి బాలకృష్ణ.
కాజల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సత్యభామ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. బజ్ విషయంలో కాస్త వెనుకబడినప్పటికీ బాలయ్య ట్రైలర్ లాంఛ్ కు రావడంతో ఒక్కసారిగా హైప్ బాగా పెరిగింది. ఎలక్షన్ క్యాంపైన్ వల్ల 40 రోజుల నుంచి కెమెరాకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే లోటును, షూటింగ్ లేకపోతే యాక్టర్లకు ఎంతో వెలితిగా ఉంటుందనే విషయాన్ని బాలయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.













