Baahubali: ఒకే సినిమాగా బాహుబలి రీరిలీజ్

టాలీవుడ్ లో కొనసాగుతున్న రీరిలీజుల ట్రెండ్ ను అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. తెలుగు ఆడియన్స్ రీరిలీజులను కొత్త సినిమాల కంటే బాగా ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను కూడా రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు బాహుబలి(baahubali) సినిమా కూడా రీరిలీజ్ కు రెడీ అవుతుంది.
బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా వర్క్స్(Arka Media words) ఇప్పటికే దానికి సంబంధించిన వర్క్స్ కూడా మొదలుపెట్టేసిందని టాక్. అయితే ఇక్కడో ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చి రెండు సినిమాలూ భారీ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండింటిలో కేవలం ఒక సినిమాను రిలీజ్ చేసి రెండో దాన్ని చేయకపోతే ఆడియన్స్ కు ఎగ్జైట్‌మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది.
అలా అని రెండింటినీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూస్తారో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో బాహుబలి నిర్మాతలు ఓ తెలివైన ప్లాన్ వేశారు. రెండు సినిమాలనీ కలిపి అనవసర సీన్స్ ను ఎడిట్ చేసి, కేవలం ఇంపార్టెంట్ సీన్స్ ను మాత్రమే యాడ్ చేసి బాహుబలిని ఒకే సినిమాగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయన సమాచారం. దీంతో ఈ రీరిలీజ్ పై అందరికీ విపరీతంగా అంచనాలు పెరగడం ఖాయం.