పెళ్లి వద్దనుకున్న అవసరాల
టాలీవుడ్ లో బ్యాచిలర్ అనగానే మొదటిగా గుర్చొచ్చేది ప్రభాస్ పేరే. ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్ తో పాటూ యావత్ టాలీవుడ్ మొత్తం వెయిట్ చేస్తుంది. కానీ డార్లింగ్ మాత్రం ఎప్పటికప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే దాన్నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తాడు. దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకున్నప్పుడు చూద్దాంలే అని అందరూ తన పెళ్లి గురించి లైట్ తీసుకున్నారు.
అయితే టాలీవుడ్ లో పెళ్లి కాని ప్రసాద్‌ల లిస్ట్ లోకి తాజాగా అవసరాల శ్రీను పేరు కూడా చేరింది. ఇప్పటివరకు అవసరాలకు అందరూ పెళ్లైందనే అనుకున్నారు. విదేశాల్లో జాబ్ చేసి, సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అవసరాల ఇంకా పెళ్లి చేసుకోలేదట. తనతో పని చేసిన అందరికీ పెళ్లిళ్లై ఫ్యామిలీతో ఉంటే ఆయన మాత్రం ఇంకా సింగిల్ గానే ఉన్నట్లు చెప్పాడు.
దీనికి కారణమేంటని అడిగితే తనకు మొదటి నుంచి కూడా పెళ్లి మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని, అందుకే పెళ్లి చేసుకోలేదని, అలాగని తను పెళ్లికి వ్యతిరేకిని కాదని ఆయన చెప్పుకొచ్చాడు. తనకు దాంపత్య జీవితం అవసరమా అని బలంగా అనిపించిందని అందుకే పెళ్లి ప్రయత్నాలు చేయలేదని అవసరాల క్లారిటీ ఇచ్చాడు.













