ఆత్రేయపురం ఆణిముత్యం ప్రారంభం
షకలక శంకర్ హీరోగా ఎమ్మెస్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఆత్రేయపురం ఆణిముత్యం ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్ రీతూ బర్మేచాపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పి.సత్యారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్. దామోదరప్రసాద్ క్లాప్ ఇచ్చారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. నా మార్క్ కామెడీ చిత్రమిది. అందర్ని మెప్పిస్తుంది అని షకలక శంకర్ అన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపులను చర్చిస్తూ వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా రూపొందిస్తున్నాం. ఆత్రేయపురంలో రాజు అనే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది అని ఎమ్మెస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమలో డియస్ రావు, చిత్ర సంగీత దర్శకుడు వెంగీ తదితరులు పాల్గొన్నారు.













