సల్మాన్ కోసం సూపర్ స్టార్‌ను ట్రై చేస్తున్న అట్లీ
హాలీవుడ్ లో చేయడం కంటే సౌత్ స్టార్ట్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంలోనే ఎక్కువ కిక్ ఉందని రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మాటలకు తగ్గట్టుగానే బాలీవుడ్ కండల వీరుడు అడుగులేస్తున్నాడు. చిరంజీవి గాడ్ ఫాదర్ లో మెగా ఫ్యామిలీ అడిగిందనే రీజన్ తో తన క్యారెక్టర్ ప్రాధాన్యత, రన్ టైమ్ చూసుకోకుండా ఒప్పేసుకున్నాడు.
ఇదిలా ఉంటే బన్నీ తో సినిమా చేయాల్సి అట్లీ, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో దాన్ని సల్మాన్ ఖాన్ తో సెట్ చేసే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ముంబై మీడియా వర్గాలంటున్నాయి. ఇందులో ఓ కీలక పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ను తీసుకోవాలని ట్రై చేస్తున్నాడట అట్లీ.
ఫుల్ లెంగ్త్ లో కాకపోయినా స్క్రీన్ పై కనిపించేది కాసేపే అయినా చాలా కాలం పాటూ గుర్తిండిపోయే రేంజ్ లో ఆ క్యారెక్టర్ ఉండనుందట. ఇంకా ఈ విషయం రజినీ వరకు వెళ్లలేదు. అట్లీ చెప్పిన కథ ఒకవేళ రజినీకి నచ్చితే సల్మాన్, రజినీ కాంబోలో సినిమా రావడం గ్యారెంటీ. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ సినిమా చేస్తున్న సల్మాన్ ఆ తర్వాత అట్లీ తో చేయనున్నాడు.













