ప్రతి మహిళ గర్వపడే సినిమా
నేటి మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు మా అశ్మీ సినిమాలో చూపిస్తున్నాం. అన్ని కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా అందిస్తున్నాం. తప్పకుండా చిత్రం కథానాయికగా నాకు మంచి పేరును తీసుకువస్తుంది అన్నారు నాయిక రుషికా రాజ్. ఆమె కథానాయికగా శేష్ కార్తికేయ దర్శకత్వంలో స్నేహా రాకేష్ నిర్మిస్తున్న చిత్రం అశ్మీ త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రుషికా రాజ్ మాట్లాడుతూ కన్నడలో మూడు సినిమాలు చేసిన నాకు ఈ చిత్రం కథానాయికగా మంచి పేరు తెస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచి సమాజానికి మంచి సందేశం వుండే సినిమాలో నటించాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరుతుంది అన్నారు. ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేని చిత్రమిది. కుటుంబం మొత్తం కలిసి హ్యాపీగా చూడొచ్చు. డైరెక్టర్ శేష్ కార్తికేయ చాలా మంచి స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. శివ, ప్రొఫెసర్, అశ్మీ అనే మూడు క్యారెక్టర్ల చుట్టూ సినిమా ఉటుంది. ఇందులో ఒక సాంగ్‌కి శాండీ అద్దంకి మంచి మ్యూజిక్ ఇచ్చారు అని తెలిపారు.













