న్యూఇయర్‌కు పతంగ్ న్యూ పోస్టర్
ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పతంగ్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్ట్రాగమ్ సన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. వేసవిలో చిత్రం విడుదల కానుంది. కాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం న్యూపోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సికింద్రబాద్ బస్తీ నేపథ్యంలో రూపొందనున్న యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఇలా అన్ని ఈ చిత్రంలో వుంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా వుంటుంది అన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.













