Arjun Das: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ దాస్?

ఖైదీ(Khaithi), మాస్టర్(master) ఇంకా మరెన్నో సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్(Arjun Das). ప్రస్తుతం అర్జున్ పవన్ కళ్యాణ్(pawan Kalyan) హీరోగా వస్తున్న ఓజి(OG) సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే పవన్ తర్వాత ఆ ట్రైలర్ లో ఎక్కువగా హైలైట్ అయింది అర్జునే.
ఓజి ట్రైలర్(OG Trailer) రిలీజయ్యాక అర్జున్ దాస్ కు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు, క్రేజ్ వస్తున్నాయి. అందులో భాగంగానే అర్జున్ దాస్ కు ఇప్పుడు బాలీవుడ్ లో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఫర్హాన్ అక్తర్(Farhan Akthar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాన్3(Don3) లో అర్జున్ దాస్ విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది. డాన్3 కోసం ఫర్హాన్ ఇప్పటికే అర్జున్ తో సంప్రదింపులు కూడా జరిపారని టాక్.
డాన్ 3లో రణ్‌వీర్ సింగ్(Ranveer singh) హీరోగా నటిస్తుండగా, ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను డిజైన్ చేయగా, ఆ క్యారెక్టర్ కు అర్జున్ అయితే సరైన న్యాయం చేస్తారని అనుకుంటున్నారట. రణ్‌వీర్ సింగ్ కూడా అర్జున్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవడంపై చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే మాత్రం డాన్3నే అర్జున్ దాస్ కు మొదటి బాలీవుడ్ ప్రాజెక్టు కానుంది. మొత్తానికి ఓజి సినిమాతో అర్జున్ భారీ ఆఫర్ ను కొట్టేసినట్టే అని చెప్పాలి.