AR Rahman: ఏఐతో రెహమాన్ కొత్త ప్రయోగం
ఆర్టిఫిషియల్ ఇంటెలినెన్స్(AI) బాగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల్లో కూడా దాని వాడకం ఎక్కువైపోయింది. రీసెంట్ గా కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు చనిపోయిన సింగర్స్ గొంతును ఏఐ ద్వారా వాడి సాంగ్స్ ను రూపొందించడం చూశాం. ఈ విషయంపై ఏఆర్ రెహమాన్(AR Rahman) స్పందించి అలా ఎవరు చేస్తున్నారో కానీ వాటిలో కొన్ని అసహ్యంగా ఉన్నాయని, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరముందని అన్నారు.
ఇదిలా ఉంటే రెహమాన్ రీసెంట్ గా మెటాహ్యూమన్స్ అనే గ్లోబల్ మ్యూజికల్ బ్యాండ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించి ఆరుగురు వర్చువల్ మ్యూజిషియన్స్ ఉంటారని, ఇప్పటివరకు ఇండియన్ మూవీలో ఏఐ జెనరేటెడ్ విజువల్స్ ను మాత్రమే చూశామని, ఇకమీదట ఏఐ మ్యూజిక్ ను కూడా చూస్తామని తెలిపారు.
గత కొన్నాళ్లుగా తాను ఏఐతో ఆడుకుంటున్నానని, ఎంతో స్టడీ చేశాకే మెటాహ్యూమన్లతో ఓ వర్చువల్ బ్యాండ్ ను క్రియేట్ చేశానని, ఆ బ్యాండ్ చాలా విభిన్నమైనదని, అందులోని వాళ్లంతా వర్చువల్ వరల్డ్ కు సంబంధించిన వాళ్లే అని చెప్పారు. గత మూడు దశాబ్దాలుగా ఇండియన్ సినీ మ్యూజిక్ లో పలు విప్లవాలు తెస్తున్న రెహమాన్ ఈ మెటాహ్యూమన్స్ ప్రాజెక్టు తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.













