AR Rahman: పెద్ది కోసం ఒక్కో పాటకు అన్ని వెర్షన్లా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు(Buchi Babu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది(Peddi). భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తానెంతో ఎదురుచూస్తున్నానని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు స్వయంగా తెలిపాడు. అంతేకాదు, ఈ సినిమా కథను తాను గత కొన్నేళ్లుగా గుండెల్లో పెట్టుకుని మోస్తున్నట్టు కూడా బుచ్చిబాబు పేర్కొన్నాడు.
పెద్ది సినిమా కథ కేవలం క్రికెట్ గురించి మాత్రమే కాదని, విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఉత్తరాంధ్ర కల్చర్, మాండలికంలో పాతుకుపోయిన ఓ కథ అని, ఈ కథను రామ్ చరణ్ కు చెప్పినప్పుడు పెద్ది పాత్ర చేయడానికి అతనసలు వెనుకాడలేదని, పెద్ది కోసం చరణ్ ఎంతగానో కష్టపడ్డాడని, సెట్స్ లోకి వచ్చిన తర్వాత చరణ్ చాలా కొత్తగా ఉండటారని, మరో టేక్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడని బుచ్చిబాబు తెలిపాడు.
పెద్ది సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(Rahman) టాలీవుడ్ ఇండస్ట్రీకి తిరిగిరావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన బుచ్చిబాబు, ఆ మూవీ కోసం రెహమాన్ ప్రతీ పాటకూ 20 నుంచి 30 ఆప్షన్స్ ఇచ్చారని, పెద్దిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంటూ అందరినీ ఆక్టటుకుంటుందని చెప్పాడు. జాన్వీ కపూర్(Jahnvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న పెద్ది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.






