‘ది ఐరన్ లేడీ’ గా జయలలిత
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పురిచ్చి తలైవి జయలలిత జీవితం ఆధారంగా ఆమె బయోపిక్‌ను తమిళ దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మురుగుదాస్ ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ది ఐరన్ లేడీ అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ జయలలిత పాత్రలో నటించనుంది. ఈ చిత్రంలో నిత్యామీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈమెది శశికళ అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లాంచ్ వేడుక త్వరలోనే జరగనుంది. నిర్మాత విష్ణు ఇందూరి కూడా జయలలిత మీద బయోపిక్‌ను నిర్మిస్తున్నానని ఇదివరకే ప్రకటించారు. ఏ ఎల్ విజయ్ తెరెక్కించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాడి ఫ్రిబవరి 24న లాంచ్ కానుంది.













