Game Changer: ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపు
సంక్రాంతి కానుకగా జనవరి 10న రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1గంట బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600 (పన్నులతో కలిపి) నిర్ణయించారు. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకూ అనుమతి ఇచ్చారు. మల్టీ ప్లెక్స్‌లో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి), సింగిల్ థియేటర్లలో రూ.135 (జీఎస్టీతో కలిపి) వరకూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. కియారా అడ్వాణీ ఈ చిత్రం కథానాయిక. దిల్ రాజు నిర్మాత.













