మెగాస్టార్ సోదరిగా అనుష్క శెట్టి?

మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాలు జరుపుకుని అఫీషియల్ గా లాంచ్ అయిన ఈ సినిమా నుంచి డైరెక్టర్ మోహన్ రాజా తప్పుకున్నారని… చిరునే తప్పించారని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ఆ వార్తలు నిజంకాదని, రూమర్లేనని వార్తలు రావడంతో ప్రస్తుతం ఈ వార్తకు ఫుల్ స్టాప్ పడింది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త బయటికి వచ్చింది. అదేంటంటే… ఈ సినిమాలో చిరు సోదరి పాత్ర కోసం చాలామంది స్టార్ హీరోయిన్లు పేర్లు వినిపించాయి. కొంతమంది సీనియర్ హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజా వార్తల ప్రకారం అనుష్క శెట్టిని ఈ పాత్ర కోసం తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అనుష్క ఈ సినిమాకి సైన్ చేసే అవకాశముందని, ఆ తర్వాత అఫీషియల్ ప్రకటన వెలువడుతుందని టాలీవుడ్ లో వినికిడి.