సైలెంటుగా పూర్తి చేసేసిన అనుష్క
గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది అనుష్క(anushka). ఆ తర్వాత అమ్మడి నుంచి మరో సినిమా వచ్చింది లేదు. అనుష్క కూడా కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం క్రిష్(Krish) దర్శకత్వంలో ఘాటి(Ghati) సినిమా చేస్తున్న అనుష్క మలయాళంలో మొదటి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా అప్డేట్స్ పెద్దగా లేకపోవడంతో ఫోకస్ లోకి రావడం లేదు. సినిమా వర్క్స్ అన్నీ చాలా సైలెంట్ గా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. కథనర్(Kathanar) టైటిల్ తో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్లో జయసూర్య(Jaya Surya) ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అనుష్క ముఖ్య పాత్రలో కనిపించనుంది.
రోజిన్ థామస్(Rojin Thomas) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. మలయాళ పరిశ్రమలో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. రూ.100 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. మరి ఈ సినిమా అనుష్కకు ఎలాంటి హైప్ తీసుకొస్తుందో చూడాలి.













