సైరా సెట్లో స్వీటీకి గాయం ?
సైరాలో సీనియర్ హీరోయిన్ అనుష్క గెస్ట్ పాత్రలో మెరవనున్న విషయం విదితమే. కొద్దిరోజుల క్రితం సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న టైంలో స్వీటీ కాలికి గాయమైనట్టు తెలుస్తోంది. చికిత్స చేసిన వైద్యులు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని అనుష్కకి సూచించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా అనుష్క జాగ్రత్తలు తీసుకున్నారట. అందుకే ఈ వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె సైలెన్స్ అనే చిత్రంలో నటిస్తుంది. అందులో మాధవన్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల అమెరికాలో చిత్రీకరణ సైతం మొదలైంది.













