డీ గ్లామర్ రోల్లో అనుష్క?
గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తుంది. అనుష్కకు ఉన్న డిమాండ్ తగ్గకపోయినా ఏ సినిమా పడితే ఆ సినిమాను ఒప్పుకోవడం లేదు. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలకే అనుష్క ఓటేస్తుంది. బాహుబలి తర్వాత అనుష్క చేసిన సినిమాలు చూస్తే ఈ విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో హీరో క్యారెక్టర్ ఉన్నప్పటికీ అనుష్క క్యారెక్టర్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
అందుకే ఆ సినిమా ఒప్పుకుంది. ప్రస్తుతం అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రెడీ అయింది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రీసెంట్ గానే మొదలైందది. ఈ సినిమా టైటిల్ తో ప్రీ లుక్ ను రీసెంట్ గా జరిగిన అమెజాన్ ప్రైమ్ కంటెంట్ మీట్ లో అనౌన్స్ చేశారు. ఘాటి అనే టైటిల్ ను ఈ సినిమా కోసం ఫిక్స్ చేశారు.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఘాటి ప్రీ లుక్ పోస్టర్ చూస్తే ఈ సినిమా చాలా ప్రయోగాత్మకంగా, ఒక కారణం కోసం సాగే సినిమాలా అనిపిస్తోంది. పోస్టర్ ను బట్టి చూస్తే సినిమాలో అనుష్క డీగ్లామర్ రోల్ లో కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో అనుష్క ముందు బాధితురాలుగా ఆ తర్వాత క్రిమినల్ గా మారే పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













