ఝాన్సీ లక్ష్మీబాబు పాత్రలో అనుష్క
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర తరువాత మరో పాత్రకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉందట. ఆ పాత్రలోనే అనుష్క నటించింది. అయితే మొదట ఈ సినిమాలో అనుష్క పాత్ర స్టోరీ టెల్లర్గా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ స్టార్ బ్యూటీ సైరా లో ఝాన్సీ లక్ష్మీబాబు పాత్రలో నటించినట్లు తెలిసింది. ఈ సినిమాలోని అనుష్క లుక్ను త్వరలోనే విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.













