బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రానున్న స్వీటీ
బాహుబలి(Baahubali) సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించి వరుస పెట్టి సినిమాలు చేస్తుందనుకున్న అనుష్క(Anushka Shetty) క్రేజ్ అయితే సాధించింది కానీ సినిమాలు చేయడంలో మాత్రం చాలా స్లో అయింది. బాహుబలి2(Baahubali2) తర్వాత అనుష్క నుంచి ఇప్పటివరకు భాగమతి(Bhagamathie), నిశబ్ధం(Nissabdham), మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాలు మాత్రమే రావడం స్వీటీ(Sweety) ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తోంది.
ఇప్పుడు రెండేళ్ల తర్వాత అనుష్క నుంచి ఒకేసారి రెండు మూవీస్ రానున్నాయి. వచ్చే ఏడాది అనుష్క నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో మొదటిది క్రిష్(Krish Jagarlamudi) దర్శకత్వంలో అనుష్క చేస్తున్న ఘాటి(Ghaati) సినిమా. ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్ తో క్రిష్ ఘాటి సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.
నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఘాటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘాటితో పాటూ అనుష్క మలయాళంలో కథనార్(Kathanar) అనే సినిమాలో కూడా నటిస్తోంది. రీసెంట్ గా ఆ సినిమా షూటింగ్ పూర్తైనట్లు సమాచారం. ఈ రెండు సినిమాలూ పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలు కొద్ది గ్యాప్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాత అయినా అనుష్క గ్యాప్ లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తుందేమో చూడాలి.













