ఎన్టీఆర్ బయోపిక్ లో ‘ఏఎన్ఆర్’ ఫస్ట్ లుక్ విడుదల
అక్కినేని నాగేశ్వరరావు 95 జయంతి ఈరోజు సందర్బంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని ఏఎన్ఆర్ లుక్ ను విడుదల చేసి అభిమానులను మరింత ఆనందం లో నింపారు. ఈ మూవీ లో ఏఎన్ఆర్ గా నాగేశ్వరరావు మనవడు సుమంత్ నటిస్తున్నాడు. ఈ లుక్ లో సుమంత్ అచ్చం నాగేశ్వరరావు గారిలాగే ఉన్నారు. ఈ లుక్ ను చూసిన వారంతా మళ్లీ ఏఎన్ఆర్ ను చూసినట్లే ఉందని అంటున్నారు. ఈ సందర్బంగా సుమంత్ తన ట్విట్టర్ లో పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి లతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌గా బాలయ్య, చంద్రబాబుగా రానా లుక్స్ మాత్రమే విడుదలయ్యాయి.













