Anjali, Shraddha: మంచి ఛాన్స్ కొట్టేసిన అంజలి, శ్రద్ధ
సంక్రాంతికి రిలీజయ్యే గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj) లో కియారా అద్వానీ(Kiara Adwani), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) మెయిన్ హీరోయిన్లు అన్న విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాల్లో పెర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యమున్న సెకండ్ హీరోయిన్లు కూడా ఉన్నారు. సెకండ్ హీరోయిన్ అనే పేరే కానీ ఆయా సినిమాల్లో వారి పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది.
అందులో ముందు రామ్ చరణ్ గేమ్(Ram Charan) ఛేంజర్ సినిమా. ఈ సినిమాలో అప్పన్న పాత్రకు భార్యగా అంజలి నటించింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ పాత్ర సినిమాకే హైలైట్ కానుందని, ఇంకా చెప్పాలంటే సినిమా కీలక మలుపు తిరిగేది అంజలి పాత్రతోనే అని, అందుకే ఆ పాత్రను శంకర్(Shankar) ఎక్కడా రివీల్ చేయకుండా చాలా సీక్రెట్ గా ఉంచారని తెలుస్తోంది.
ఇక బాలయ్య డాకు మహారాజ్ లో శ్రద్ధ శ్రీనాథ్ పాత్ర కు కూడా బాబీ(Bobby) చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. చిన్న పాపకు సంబంధించిన సెంటిమెంట్ కూడా శ్రద్ధా పాత్రతోనే ముడిపడి ఉంటుందని టాక్. చూస్తుంటే ఈ రెండు సినిమాలూ హిట్ అయితే మాత్రం అంజలి, శ్రద్ధ లకు మంచి బ్రేక్ దొరుకుతుంది. తద్వారా తర్వాత మంచి ఛాన్సులొచ్చే అవకాశముంది. మరి అంజలి, శ్రద్ధకు ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.













