Game Changer: అసలైన గేమ్ ఛేంజర్ ఆమేనట!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్(game changer) జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చరణ్ కెరీర్లోనే బెస్ట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఎంతో బలంగా చెప్తుంది. చరణ్(charan) డ్యూయల్ రోల్ చేయబోతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani), అంజలి(Anjali) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
యంగ్ రామ్ చరణ్ పాత్రకు కియారా జోడీగా ఉంటే తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుంది. గేమ్ ఛేంజర్ లో అంజలి పాత్రను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఫ్లాష్ బ్యాక్ లో అంజలి, రామ్ చరణ్ పై ఓ సాంగ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో అంజలి పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని డైరెక్టర్ శంకర్(Shankar) ఇప్పటికే పలుసార్లు వెల్లడించాడు.
ఆ కారణంతోనే ఇప్పటివరకు అంజలి క్యారెక్టర్ ను సర్ప్రైజింగ్ గా ఉంచారని తెలుస్తోంది. సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో అంజలి కనిపిస్తుందని, చాలా కాలం తర్వాత అంజలి తెలుగులో చేస్తున్న పెద్ద సినిమా ఇదేనని అందరూ అంటున్నారు. శంకర్ అంజలి పాత్రని చాలా బలంగా డిజైన్ చేశాడని, కథను మలుపు తిప్పే అసలైన గేమ్ ఛేంజర్ గా అంజలి పాత్ర ఉంటుందని యూనిట్ సభ్యులంటున్నారు. ఈ సినిమాలో తన పాత్ర క్లిక్ అయితే ఆమెకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలొచ్చే ఛాన్సుంది.













