Anil Sunkara: అందుకే 1నేనొక్కడినే ట్రైలర్ రిలీజ్ చేయలేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా భారీ అంచనాలతో రిలీజై అనుకున్న అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. ఈ సినిమా నుంచి ముందుగా లుక్స్ వచ్చినప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా అనుకున్నారంతా. కానీ 1నేనొక్కడినే ఎవరూ ఊహించనంతగా ఫ్లాపుగా నిలిచింది.
కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా సినిమాను రిలీజ్ చేసి అప్పట్లో మేకర్స్ ఈ సినిమా విషయంలో చాలా డేరింగ్ స్టెప్ వేశారు. అందరిలానే తాము కూడా ట్రైలర్ ను రిలీజ్ చేయాలని సినిమాలోని మెయిన్ ప్లాట్ ను రివీల్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేసి దాన్ని కొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ కు స్పెషల్ స్క్రీనింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. స్క్రీనింగ్ చేసే సమయానికి ఒకరు ఫోన్ చేసి ట్రైలర్ ను రిలీజ్ చేయొద్దని అలా చేస్తే సినిమాను ఓపెనింగ్స్ రావని చెప్పారని నిర్మాత అనిల్ సుంకర రీసెంట్ గా తెలిపారు.
అందరిలానే కథ గురించి, హీరోకు ఉన్న మైండ్సెట్ గురించి ముందుగానే ట్రైలర్ లో రివీల్ చేసి ఉంటే 1 నేనొక్కడినే సినిమాకు బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదని ఆయన అన్నారు. ఆ సినిమా కంటే ముందే తాను మహేష్ తో దూకుడుతో సూపర్ హిట్ అందుకున్నానని, ఈ సినిమా దూకుడు రికార్డులను బద్దలు కొడుతుందనుకుంటే అది జరగలేదని ఆయన అన్నారు.







