NBKని ఓ రేంజ్ లో వాడేసుకున్న అనిల్
సినిమా మేకింగ్, టేకింగ్ తో పాటూ ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్తగా ఆలోచించే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాలతో పాటూ ప్రమోషన్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అనిల్ రావిపూడి బాలకృష్ణతో చేస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే అందరికీ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అందుకు తగ్గట్టే అనిల్ రావిపూడి ఈ సినిమాను మలిచాడు. ఇప్పటివరకు భగవంత్ కేసరి నుంచి వచ్చిన పోస్టర్ల నుంచి ట్రైలర్ వరకు అన్నింట్లో బాలయ్య బాబు బ్రాండ్‌ను అనిల్ చాలా గట్టిగా వాడుకుంటున్నాడని తెలిసిపోతుంది. కమర్షియల్ సినిమాలోనే మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో అనిల్ నిపుణుడు.
బాలయ్యతో అనిల్ ఈ మూవీలో సీరియస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ తో పాటూ మంచి కామెడీని కూడా పండించాడని ట్రైలర్ చూశాక అందరూ ఫిక్స్ అయిపోయారు. దీంతో పాటూ ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ పేరు నేలకొండ భగవంత్ కేసరి. అంటే షార్ట్ కట్ లో NBK. బాలయ్య ఒరిజినల్ నేమ్ కూడా అదే. అందుకే అదే మీనింగ్ వచ్చేలా ఈ సినిమాలో బాలయ్యకు ఆ పేరు పెట్టాడని, దీన్ని బట్టి అనిల్, బాలయ్య బ్రాండ్ ను ఏ రేంజ్ లో వాడుకున్నాడో అర్థం అవుతుందని, సినిమా కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు.













