సోషల్ మీడియా లో వచ్చిన ప్రాజెక్టులు చేయడం నిజమే! స్పష్టం చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి

దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్3’ సినిమా షూటింగ్ చేస్తున్న ఆయన ఈ మధ్య కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో తన తదుపరి సినిమాల గురించి సోషల్ మీడియా లో అత్యధిక రూమర్లు వచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే, అది అనిల్ రావిపూడినే. ఎఫ్3 సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఒక సినిమా అని, ఆ తర్వాత మరో మారు మహేశ్ బాబుతో మరో సినిమా అని, అనంతరం రవితేజాతో ‘రాజా ది గ్రేట్’ సినిమా సీక్వెల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాక.. రవితేజ సినిమాలో రామ్ కూడా నటిస్తున్నాడని పుకార్లు వచ్చాయి. అయితే వీటిలో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అనే కన్‌ఫ్యూజన్‌లో వున్నారు జనం.
తాజాగా ఈ వార్తలు అన్నింటిపై అనిల్ స్పందించాడు. తాజాగా తన తదుపరి ప్రాజెక్టుల గురించి అనిల్ క్లారిటీ ఇచ్చాడు. “ఈ వార్తలు అన్ని వాస్తవాలే అని అతను తెలిపాడు. తన తదుపరి సినిమాల గురించి అతను మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణతో సినిమాకి స్క్రిప్ట్ రెడీ అయింది. ఇది ఒక డిఫరెంట్ జోనర్‌లో సాగే సినిమా. కానీ…. ఇది మల్టీస్టారర్ కాదు. ఇక మహేశ్‌బాబుతో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరు సమయంలోనే దీనిపై చర్చ జరిగింది. స్టోరీ కూడా మహేశ్ ఓకే చెప్పారు. అయితే త్రివిక్రమ్ సినిమా ముందుకు రావడం వల్ల ఇది ఆలస్యం అవుతోంది. ఇక రవితేజాతో ‘రాజా ది గ్రేట్’ సినిమా సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. కానీ, దీనిపై డిస్కషన్ ఇంకా జరగలేదు’’ అని స్పష్టం చేశాడు.