నా వరకైతే అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు
గాయనిగా మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత హీరోయిన్గా మారింది ఆండ్రియా. కమల్ హాసన్, కార్తీ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. తాజాగా అమె నటించిన విశ్వరూపం -2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆండ్రియా, తమిళనాట సంచలనం సృష్టిస్తున్న శ్రీరెడ్డి గురించి స్పందించింది. ఎక్కడికి వెళ్లినా శ్రీరెడ్డి గురించి అడుగుతున్నారని చెప్పింది. ఈ మధ్య ఎక్కడకు వెళ్లినా సంచలనంగా మారిన శ్రీరెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆమె చెబుతున్నది నిజం అయితే, అలా ధైర్యంగా బయటపెట్టడం కరెక్ట్. నిజాలు అలా వెల్లడించడానికి చాలా దైర్యం కావాలి. అందుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలి. నా వరకైతే అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. ఎందుకంటే నేను గాయనిగా పరిశ్రమలోకి ప్రవేశించానని ఆండ్రియా చెప్పింది.













