నితిన్ సినిమా చేసేందుకు పూజా హెగ్డే నో చెప్పింది.. మరి నయనతార ఏమంటుందో?
`భీష్మ` సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న నితిన్ అదే ఉత్సాహంతో తన నెక్స్ట్ మూవీ `రంగ్‌దే` చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి 20 శాతం టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. దాన్ని కంప్లీట్ చేసి త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న నితిన్‌కి లాక్డౌన్ బ్రేక్ వేసింది. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. అందులో ఒకటి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. మరో సినిమా బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అంధా ధున్ రీమేక్. అంధా ధున్ కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా అవార్డులు కూడా గెలుచుకుంది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు హక్కులు దక్కించుకున్నాడు నితిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి రాలేదు. కీర్తి సురేష్ మరోసారి నితిన్‌తో జతకట్టనుందన్న వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలో నిజం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. తాజాగా పూజా హెగ్డేను సంప్రదించారని తెలిసింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు పూజా నో చెప్పిందని సమాచారం. ప్రభాస్‌తో రాధేశ్యామ్, అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్‌లతో వరసగా సినిమాలు చేస్తుండడం వల్ల నితిన్ సినిమా చేసేందుకు వీలు పడదని పూజా చెప్పినట్టు తెలుస్తోంది. ఇక మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంధాధున్ చిత్రంలో ఉంది. బోల్డ్‌గా ఉంటూనే నెగెటివ్‌గా ఉండే ఈ క్యారెక్టర్‌ను టబు పోషించింది. ఆమె నటనకుగాను జీ సినిమా అవార్డు కూడా అందుకుంది. అంత కీలకమైన క్యారెక్టర్‌ను తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రమ్యకృష్ణ, అనసూయ పేర్లు కూడా పరిశీలించారని తెలుస్తోంది. తాజాగా నయనతార అయితే ఆ క్యారెక్టర్‌ను బాగా హ్యాండిల్ చెయ్యగలదని చిత్ర యూనిట్ భావించిందట. అందుకే ఆమెను పంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. సౌత్‌లో స్టార్ హీరోయిన్గా వెలిగిపోతున్న నయనతార అలాంటి నెగెటివ్ క్యారెక్టర్ చేస్తుందా అనేది అందరిలోనూ ఉన్న సందేహం. అదే జరిగితే సినిమాకు నయన చాలా ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నయనతార ఈ సినిమా చేసేందుకు ఓకే చెబుతుందో లేదో చూడాలి.













