బిగ్‌బాస్4కి రంగం సిద్ధం..షోకి రెడీ అవుతున్న ఇద్దరు యాంకర్లు
నిన్న మొన్నటి వరకు బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అనే చర్చ జరిగింది. ఇప్పుడా సమస్య లేదు. ఎందుకంటే మా టీవీలో దానికి సంబంధించి త్వరలోనే బిగ్‌బాస్4 అంటూ యాడ్ వస్తోంది. దీంతో ఇప్పుడు ఎవరెవరు ఈ షోలో పార్టిసిపేట్ చెయ్యబోతున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కొంతమంది పేర్లు వినిపించాయి. వారిలో డాన్స్ మాస్టర్ రఘు, మంగ్లీ, నోయల్ సీన్, రమ్య పసుపులేటి, ప్రియ వడ్లమాని ఉన్నారు. వీరు కాక ఇంతకుముందు హీరో తరుణ్, బిత్తిరి సత్తి కూడా ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే తను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదని తరుణ్ స్వయంగా ప్రకటించాడు. ఇక బిత్తిరి సత్తి విషయం ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోకి మరింత గ్లామర్ యాడ్ కాబోతోంది. బుల్లితెరపై యాంకర్లుగా మంచి పేరు తెచ్చుకున్న మంజూష, విష్ణుప్రియ బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనబోతున్నారు.
బిగ్‌బాస్ 4 త్వరలోనే అనే ప్రకటన ఇస్తున్న నిర్వాహకులు ఈ షోలో పాల్గొనేవారి పేర్లను కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సీజన్ 4కి వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయంలో చాలా కాలంగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే నాగార్జున సీజన్ 4ను నిర్వహిస్తారని ఇంతకుముందే న్యూస్ వచ్చింది. అంటే నాగార్జున ఫైనల్ అయినట్టే. ఎన్నో కట్టుదిట్టమైన జాగ్రత్తల నడుమ బిగ్‌బాస్4ను స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఇప్పుడు ఎక్కువ శాతం ప్రజలు ఇళ్ళకే పరిమితమవుతున్నారు కాబట్టి ఈసారి బిగ్‌బాస్‌కి ఆదరణ భారీ ఎత్తున ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.













