అందాల రాశితో పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్..
బుల్లితెర యాంకర్ ప్రదీప్ ఎప్పుడూ షోస్ తో బిజీగా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఈ యాంకర్ షోస్ తో ఎంత పాపులర్ అయ్యాడో, అతడి పెళ్లి విషయంలో కూడా అంతే పాపులర్ అయ్యాడు. ప్రదీప్ పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొంత కాలంగా ట్రేండింగ్ లో ఉన్నాయి. పలు టీవీ షోల్లో యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన మార్కు పంచ్ లతో ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు ప్రదీప్.
బుల్లితెర యాంకర్ లలో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ గా ప్రదీప్ మాచినేనిని చెప్పుకోవొచ్చు. ఇతడి పెళ్లిపై గత కొంత కాలంగా వరుసగా కథనాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా అలాంటి వార్తే ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఎట్టకేలకు ఈ వార్తలపై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. నేను కాస్త బిజీగా వుండటం వల్ల ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించలేకపోయానని ఆయన అన్నారు.
ప్రస్తుతం నేను సింగిల్ ఏ అని చెప్పకనే చెప్పారు ఈ కుర్ర యాంకర్. అంతే కాకుండా తన పెళ్లి పై వచ్చిన రూమర్స్ కి సమాధానమిస్తూ, ఎవరో డిజైనర్ తో తాను ఏడడుగులు వేయబోతున్నానంటూ రాసేశారని కానీ ఆమె ఎవరో కూడా నాకు తెలియదని స్పష్టం చేశాడు. నా టీమ్ ఆమె డిజైన్ చేసిన డ్రెస్ లని కొని వుండొచ్చేమో కానీ అనవసరంగా ఆమె పేరుని ఇందులోకి లాగకండి అన్నాడు. అంతే కాకుండా తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు.
ప్రెజెంట్ నా దృష్టంతా టీవీ షోలు, సినిమాలపైనే వుందని నేను హీరోగా మరో సినిమా చేస్తున్నానని ప్రదీప్ అన్నారు. అన్ని కరెక్ట్ గా కుదిరితే వచ్చే ఏడాదే ఆ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపాడు. ఇక గత ఏడాదే ప్రదీప్ `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. తరువాత కొంత విరామం తీసుకున్న ప్రదీప్ త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.













