పవన్ తో అనసూయ స్పెషల్ సాంగ్
తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించిన అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ కు బై బై చెప్పేసి సిల్వర్ స్క్రీన్ కే పరిమితమైంది. బుల్లితెరపై కెరీర్ బాగానే కొనసాగుతున్నప్పటికీ ఇక చాలు అనుకుని బయటికొచ్చేసింది అనసూయ. క్షణం సినిమా నుంచి అనసూయ స్పెషల్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్న విషయం తెలిసిందే.
అయితే అనసూయ ప్రస్తుతం ఓ రియాలిటీ షో కు జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇందులో శేఖర్ మాస్టర్ మరొక జడ్జి. ఈ షో ను శ్రీముఖి హోస్టింగ్ చేస్తుంది. తాజాగా ఈ షో లో అనసూయ ఓ విషయాన్ని రివీల్ చేసింది. ఫస్ట్ టైమ్ బుల్లితెరపై తాను ఈ విషయాన్ని చెప్తున్నానని, తాను పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ఓ సాంగ్ చేశానని, ఆ సాంగ్ నెక్ట్స్ రేంజ్ లో ఉండబోతుందని అనసూయ చెప్పుకొచ్చింది.
వాస్తవానికి అత్తారింటికి దారేది టైమ్ లోనే అనసూయ పవన్ తో సాంగ్ చేయాల్సింది కానీ అప్పుడు ఆ ఛాన్స్ ను అనసూయ వద్దనుకుంది. మొత్తానికి ఇప్పుడు పవర్ స్టార్ తో కలిసి కాలు కదిపింది. అయితే అనసూయ పవన్ తో సాంగ్ చేశానని చెప్పింది కానీ అది ఏ సినిమాలో అన్నది మాత్రం చెప్పలేదు. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలున్నాయి. వీటిలో ఏ సినిమాలో అనసూయ సాంగ్ చేసిందో తెలియాల్సి ఉంది.













