Pawan Kalyan: వీరమల్లుతో అనసూయ స్పెషల్ సాంగ్
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు(HariHara veeramallu) సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఓ వైపు వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తి చేస్తూనే మరో వైపు షూటింగ్ లో బిజీ ఉంది చిత్ర యూనిట్.
పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక అసలు ఖాళీగా ఉండటం లేదు. కన్ని నెలల తర్వాత పవన్ రీసెంట్ గానే మళ్లీ మేకప్ వేసుకుని వీరమల్లు సెట్స్ లో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో అనసూయ(Anasuya) కనిపించనుందని సమాచారం. గణేష్ మాస్టర్(Ganesh Master) కొరియోగ్రఫీలో ఈ సాంగ్ ను ఇప్పటికే షూట్ చేశారట. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ సోర్స్ మాత్రం బలంగానే వినిపిస్తోంది.
గతంలో అనసూయను అత్తరాంటికి దారేది(Attharintiki Daaredhi)లో పబ్ సాంగ్ కోసం అడిగినప్పుడు నో చెప్పడం, ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ సాంగ్ కోసం జట్టు కట్టడం ఆసక్తిగా మారింది. ఆ మధ్య ఈ వార్తను అనసూయ స్వయంగా ఓ రియాలిటీ షో లో బయటపెట్టింది. ఇప్పటికే రంగస్థలం(Rangasthalam)లో రామ్ చరణ్(Ram Charan), గాడ్ ఫాదర్(God Father) లో చిరంజీవి(Chiranjeevi)తో కలిసి నటించిన అనసూయకు ఇప్పుడు పవన్ తో కూడా కలిసి నటిస్తే సర్కిల్ పూర్తవుతుంది.













