Ananya Pandey: చీరలో మరింత అందంగా అనన్యా
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో సెలబ్రిటీలు తమను తాము వాటి ద్వారానే ప్రమోట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే గ్లామర్ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చీర కట్టులో కూడా గ్లామర్ ఒలకబోస్తూ కనిపించింది. హెవీ ఎంబ్రాయిడరీ బార్డర్, ప్లెయిన్ ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని దానికి గోల్డెన్ కలర్ బ్లౌజ్ తో స్టైల్ చేసి జుట్టును ఫ్రీగా వదిలేసి, చేతులకు బ్యాంగిల్స్, చెవి దిద్దులతో పాటు నుదిటిన చిన్న బొట్టు పెట్టుకొని మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ఫోటోల్లో అనన్యా చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.






