ఆనంద్ దేవరకొండ మూడో సినిమా ‘పుష్పక విమానం’
నిర్మాణ భాగస్వామిగా అన్న విజయ్ దేవరకొండ
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమల జంటగా సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన పుష్పక విమానం అప్పట్లో ఓ సంచలమ్. మళ్ళీ అదే టైటిల్ తో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మూడో సినిమాగా ‘పుష్పక విమానం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు విజయ్.సినిమాల పరంగా విజయ్ దేవరకొండ హవా మామూలుగా లేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే ఒక సినిమాలతో కాదు వ్యాపార పరంగా కూడా సత్తా చాటాలని డిసైడ్ అయిన రౌడీ స్టార్.. ‘కింగ్ ఆఫ్ ది హిల్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ నిర్మాణ సంస్థ కార్యకలాపాలు యాక్టీవేట్ చేసిన విజయ్ దేవరకొండ, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ అనే సినిమా రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు విజయ్. ఆనంద్ దేవరకొండ మూడో సినిమాగా ఈ ‘పుష్పక విమానం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డార్క్ కామెడీ మూవీగా కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దామోదర అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ సరసన శాన్వి మేఘన, గీత సైనీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విజయ్ దేవరకొండ చిత్ర బృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. యంగర్ బాయ్ ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ స్టఫ్‌తో మీ ముందుకొస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ విజయ్ ట్వీట్ చేశారు. ఈ ‘పుష్పక విమానం’ పోస్టర్ చూస్తుంటే కామెడీ పరంగా ఈ సినిమా కొత్తదనం చూపిస్తుందని అర్థమవుతోంది. సో.. చూడాలి మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి హిట్ పట్టేస్తాడనేది!.
‘‘దొరసాని’’ లాంటి మంచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన హీరో ఆనంద్ దేవరకొండ తన రెండో చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ తన మూడో సినిమాగా “పుష్పక విమానం” అనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తున్నాడు. దామోదర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ : ఈ కథని న్యూస్ లో చూసి ఇన్స్పైర్ అయి దానికి నిజ జీవిత క్యారెక్టర్స్ ని జోడించి తయారు చేసుకున్నాను , మొదట ఈ కథని విజయ్ దేవరకొండ ఫాదర్ గోవర్ధన్ గారికి చెప్తే ఆయనకి బాగా నచ్చడంతో ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. అదే టైం లో ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమా రిలీజ్ అవడంతో ఈ కథకి అతను అయితే బావుంటాడని అనుకుని ఆనంద్ దేవరకొండ హీరో గా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామా ని గుర్తుచేస్తూ, పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది. ఇందులో ఆనంద్ తో పాటు సునీల్, నరేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.శాన్వి మేఘన,గీత్ సాయిని, ఇందులో హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. అందర్నీ అలరిస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ అవుతుంది.” అని అన్నారు.













