ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా`మిడిల్ క్లాస్ మెలోడీస్`
ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 11గా నిర్మించిన చిత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్`. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు దర్శకునిగా పరిచయమవుతున్నారు. వెనిగళ్ళ ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా…. `మిడిల్ క్లాస్ మెలోడీస్` చిత్ర నిర్మాత వెనిగళ్ల ఆనందప్రసాద్ మాట్లాడుతూ “సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. తొలి కాపీ కూడా సిద్ధంగా ఉంది. కథకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు తీద్దామనుకునే నిర్ణయంలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. గుంటూరు నేపథ్యంలో కథ సాగుతుంది. గుంటూరు జిల్లా కొలకలూరు ప్రాంతంలోనూ, గుంటూరు సిటీలోనూ… పరిసర ప్రాంతాల్లోనూ షూటింగు చేశాం. పాత్రలన్నీ గుంటూరు యాసలోనే మాట్లాడుతాయి. ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ లాక్ డౌన్ పరిస్థితుల వల్ల విడుదలను వాయిదా వేశాం. త్వరలోనే విడుదల తేదీ వివరాలను వెల్లడిస్తాం’’ అని అన్నారు.
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, ప్రేమ్ సాగర్, ప్రభావతి వర్మ తదితరులు సాంకేతిక నిపుణులు: కెమెరా: సన్నీ కూరపాటి, కథ, సంభాషణలు: జనార్దన్ పసుమర్తి, స్క్రీన్ప్లే: జనార్దన్ పసుమర్తి, వినోద్ అనంతోజు, ఎడిటర్: రవితేజ గిరిజాల, కాస్ట్యూమ్ డిజైనర్: సంజనా శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై, సంగీతం: స్వీకర్ అగస్తి, ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్: ఆర్.హెచ్. విక్రమ్, సాహిత్యం: సానాపతి భరద్వాజ పాత్రుడు, శ్రీ సాయి కిరణ్ , విస్సాప్రగడ రవికృష్ణ, గాయనీగాయకులు: రమ్య బెహరా, విజయ్ ఏసుదాస్, రామ్ మిర్యాల, అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తి, సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి, సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్, లైన్ ప్రొడ్యూసర్: నరేష్ రెడ్డి పోలసాని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి నిర్మాత: వెనిగళ్ళ ఆనందప్రసాద్, దర్శకత్వం: వినోద్ అనంతోజు.













