అమితాబ్ చేతిపై స్టాంప్
కరోనా వైరస్‌పై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన చేతిపై వేసిన హోంక్వారంటైన్’ స్టాంపు చిత్రాన్ని ట్వీట్ చేశారు. మంగళవారం బాగా పొద్దు పోయిన తరువాత ఇది ట్వీట్ అయింది. ముంబై లోని ఓటరు ఇంకుతో చేతిపై ఈ హోంక్వారంటైన్ స్టాంపు వేశారని, భద్రత పాటించాలని, వైరస్ బయటపడితే ఐసొలేట్‌గా ఉండాలని ఆయన ట్వీట్ ద్వారా సూచించారు. సోషల్ మీడియాలో ఈ సూచనలు వేగంగా ప్రసారం చేశారు. ఇటీవల ఆయన కరోనాపై గేయం రచించారు. ట్విట్టర్ ద్వారా ప్రసారం చేశారు. వారంవారం అభిమానులతో తన ఇంటివద్ద జరిగే సమావేశాన్ని కూడా అమితాబ్ రద్దు చేశారు.













