కంగువకు స్పీడు బ్రేకర్లా మారిన అమరన్
మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న కంగువ(Kanguva) సినిమాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సూర్య(Suriya) ఎంతో కష్టపడిన చేసిన ఈ పాన్ ఇండియా సినిమా కోలీవుడ్ కు బాహుబలి(Baahubali) లా నిలిచిపోతుందని అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు వెర్షన్ కు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.
వేకువఝామున నాలుగు గంటల షోలకు రెడీ అయ్యారంటే మేకర్స్ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా రిలీజైన కొత్త ట్రైలర్ సినిమాపై హైప్ ను మరింత పెంచేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సెకండ్ వీక్ లోకి ఎంటరైన అమరన్(Amaran) సినిమా వల్ల కంగువకు ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇప్పటికే రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి మంచి రన్ తో దూసుకెళ్తున్న అమరన్ కు ఇప్పటికీ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వీక్ లో కూడా అమరన్ ను ఎక్కువ స్క్రీన్స్ లో కంటిన్యూ చేయాలని తమిళ డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. దీంతో కంగువకు స్క్రీన్ కౌంట్ తగ్గుతుందని సూర్య ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అదే జరిగితే ఆల్ టైమ్ రికార్డు కోసం వెయిట్ చేస్తున్న కంగువ మేకర్స్ కోరిక నెరవేరే ఛాన్సు తగ్గుతుంది. కాబట్టి కంగువకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావడం తప్పించి మరో మార్గం లేదు.













