16న అమర్ అక్బర్ అంటోని విడుదల
రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా శ్రీనువైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం అమర్ అక్బర్ అంటోనీ. నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 10న నిర్వహించనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, రెండో పాటను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ కన్పించనున్నారని, ఈ సినిమా సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కిందన్నారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.













