దిశాకు తెలుగులో మరో అవకాశం ?
పూరి జగన్నాథ్ సినిమా లోఫర్ తో తెలుగులో అడుగుపెట్టింది దిశా పటాని. లోఫర్ పరాజయంతో దిశకు మళ్లీ తెలుగు నుంచి పిలుపు రాలేదు. ఈలోగా బాలీవుడ్లో విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఇప్పుడు మళ్లీ దిశకు తెలుగు నుంచి మరో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా ఐకాన్ చిత్రం తెరకెక్కనుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారు. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా దిశాని ఎంచుకున్నట్టు సమాచారం. అదే కనుక నిజమైతే.. దిశా పటానీ దశ తిరిగినట్టే. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురములో చిత్రంతో బిజీగా ఉన్నారు బన్నీ. ఈ సినిమా పూర్తయ్యాకే ఐకాన్ సెట్స్ మీదకు వెళ్తుంది.













