Allu Arjun: మరోసారి బన్నీ నోట అల్లు ఆర్మీ.. మెగా ఫ్యాన్స్ ఫైర్
పుష్ప2(Pushpa2) అంత పెద్ద హిట్ అయినా ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి పెద్ద వేడుక నిర్వహించకపోవడంతో ఫ్యాన్స్ లో ఆ అసంతృప్తి అలానే ఉండిపోయింది. సంధ్య థియటర్ దుర్ఘటన వల్ల ఎవరూ పుష్ప2 సక్సెస్ ను పబ్లిక్ గా చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల తర్వాత పుష్ప2 థ్యాంక్స్ మీట్ ను నిర్వహించింది చిత్ర బృందం.
సంధ్య థియేటర్ దుర్ఘటన, తన అరెస్ట్ తర్వాత బన్నీ(Bunny) హాజరైన మొదటి సినిమా ఈవెంట్ ఇదే. దీంతో ఈ ఈవెంట్ లో బన్నీ ఏం మాట్లాడతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈవెంట్ లో బన్నీ(Allu Arjun) చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నట్టు కనిపించాడు. అయితే ఈ సందర్భంగా బన్నీ తన ఫ్యాన్స్ గురించి మాట్లాడాడు.
తనకు ఇంతగా సపోర్ట్ చేసి, తనను ఇంత వరకు తీసుకొచ్చిన అల్లు ఆర్మీకి థ్యాంక్స్ చెప్పిన బన్నీ, ముందు ముందు తన సినిమాలతో ఇంకా గర్వపడేలా చేస్తానని మాటిచ్చాడు. ఈ మాటలు విన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు బన్నీపై ఫైర్ అవుతున్నారు. కెరీర్ మొదట్లో మెగా ఫ్యాన్స్ లేనిదే తాను లేనని చెప్పిన నువ్వు, ఇప్పుడు సక్సెస్ వచ్చాక నీకంటూ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని, ఆర్మీ అంటున్నావా అని కామెంట్ చేస్తున్నారు. బన్నీ తన ఫ్యాన్స్ ను ఆర్మీ అనడం దగ్గర నుంచే అసలు వార్ మొదలైన సంగతి తెలిసిందే. అయినా మెగా, అల్లు ఫ్యామిలీలు బాగానే ఉంటున్నాయి కదా అని ఆలోచించకుండా ఇలాంటి చిన్న చిన్న వాటికి ఫ్యాన్స్ గొడవలు పడటమేంటోనని నెటిజన్లు భావిస్తున్నారు.













