బన్నీ సినిమాకు టైటిల్ ఖరారు!
స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ మాటల మాంత్రికుడికి ఆ సెంటిమెంట్ ఎక్కువ. మహేష్‌బాబుతో రూపొందించిన అతడు తో త్రివిక్రమ్ అ సెంటిమెంట్ మొదలైంది. అక్కడి నుంచి అత్తారింటికి దారేది, అ..అ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ వరకు ఈ సెంటిమెంట్ కొనసాగింది. ఇక అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి కూడా త్రివిక్రమ్ అ సెంటిమెంట్‌ను ఆపాదిస్తున్నట్టు తెలిసింది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూడవ సినిమపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్రానికి అ సెంటిమెంట్‌తో అలకనంద అనే టైటిల్‌ను ఫిల్మ్‌మేకర్స్ ఖారారు చేసినట్లు తెలిసింది. ఇక వేణు శ్రీరామ్‌తో బన్నీ సినిమాకు ఐకాన్ వంటి చక్కని టైటిల్ కుదిరింది.













