బుట్టబొమ్మ సంచలన రికార్డు..
2019లో సంగీత ప్రియులని ఎంతగానో అలరించిన పాపులర్ సాంగ్ బుట్టబొమ్మ. సామాన్యుడు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సాంగ్కు ఫిదా అయ్యారు. వార్నర్ వంటి స్టార్ క్రికెటర్ కూడా ఈ సాంగ్కు స్టెపులేయడంతో పుల్ పాపులర్ అయ్యింది. తాజాగా ఈ సాంగ్ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ టచ్ చేసిన సంచలన రికార్డు సెట్ చేసింది. ఈ సాంగ్కు ఆదరణ రోజురోజుకు పెరుగుతూ పోతుండడం పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురములో చక్కటి కుటుంబ కథా చిత్రంగా మెప్పించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తమన్ స్వరసారథ్యంలో రూపొందిన బుట్టబొమ్మ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు. ఈ పాటలోని నృత్యరీతులు యువతను ఉర్రూతలూగించాయి.













