Allu Arjun: బన్నీ చేసిన తప్పేంటంటే
పుష్ప2(Pushpa2) సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన ఘటనకు సంబంధించిన వ్యవహారంలో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీలో సైతం ఈ వ్యవహారం డిస్కషన్ కు వచ్చింది.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy), ఎంఐఎం నేత అక్బరుద్దీన్(Akbaruddhin) బన్నీపై తీవ్ర ఆరోపణలు చేయగా దానికి కౌంటర్ గా బన్నీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్దమని ఖండించాడు. అయితే రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ చేసిన ఆరోపణల్లో నిజమెంత, ఆ తర్వాత బన్నీ ఇచ్చిన వివరణలో వాస్తవాలెంత, ఇరు వర్గాల్లో ఎవరి వాదన సమర్ధంగా ఉందనే చర్చ నెట్టింట నడుస్తోంది.
అయితే రెండు వర్గాల వ్యాఖ్యల్లోనూ కొన్ని తప్పులైతే కనిపిస్తున్నాయి. బన్నీ ప్రెస్ మీట్ లో తాను అక్కడికి వెళ్లాక కాసేపటికే రష్ ఎక్కువైందని తెలిసి వెళ్లిపోయినట్లు చెప్పాడు. కానీ బన్నీ అక్కడికి సినిమా స్టార్టింగ్ కు ముందు వచ్చి రెండు గంటలకు పైగా అక్కడున్నట్లు క్లారిటీగా ప్రూఫ్స్ ఉన్నాయి. బన్నీని థియేటర్లో చూసిన ఆనందంలో అభిమానులు ఆ రోజు నెట్టింట పోస్ట్ చేసిన వీడియోలే దానికి ఆధారం. ఇక రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ చెప్పినట్టు మహిళ చనిపోయిన విషయం తెలిసినా కూడా బన్నీ అక్కడ్నుంచి కదల్లేదన్న మాటలు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకున్నాయి. తన భార్య చనిపోయిన విషయం తనకు అర్థరాత్రి 3 గంటల ప్రాంతంలో తెలిసినట్టు మృతురలి భర్త మీడియాకు వెల్లడించాడు. భర్తకే ఆ విషయం తెలియనప్పుడు సినిమా మధ్యలో బన్నీకి తెలిసే ఛాన్స్ ఎలా ఉంటుందనే అంటున్నారు. మొత్తానికి ఇరు వర్గాల మాటల్లో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తానికి ఈ విషయం ఎలా ముగుస్తుందనేది చూడాలి.













