అల్లు అర్జున్ నయా లుక్ అదిరిందిగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నయా లుక్‌తో అదరగొడుతున్నాడు. చెవి పోగులు, సైడ్ కటింగ్‌తో నయా స్టైల్లో రచ్చ చేస్తున్నాడు. ఓ యాడ్ షూట్లో పాల్గొన్న బన్నీ.. ఇలా నయా లుక్‌లోకి మారిపోయాడు. స్టైలిష్ లుక్‌లో సరికొత్త ఫొటోలను రిలీజ్ చేసి.. ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాడు. పుష్ప మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ.. అందరూ పుష్ప-2 మూవీ కోసం ఎదురుచూస్తు్న్న తరుణంలో ఈ క్రేజీ పిక్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. సిగరేట్ పెట్టుకుని.. లైట్‌గా జుట్టు నెరుస్తున్నట్లు వైట్ కలరింగ్ ఇచ్చి రిలీజ్ చేసిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ అల్లు అర్జున్ క్యాప్షన్ ఇచ్చి.. ఈ ఫొటోను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ కోసం బన్నీ వెయిట్ చేస్తున్నాడు. ఈలోపు యాడ్స్‌ను కంప్లీట్ చేస్తున్నాడు.
ఇటీవల త్రివిక్రమ్‌తో యాడ్ కంప్లీట్ చేసిన అల్లు అర్జున్.. తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్లో సరికొత్త యాడ్‌లో యాక్ట్ చేశాడు. ఈ యాడ్ షూట్లో పాల్గొన్న స్టైలిష్ స్టార్.. ఇలా నయా లుక్‌లో కనిపించాడు. బన్నీ లుక్ కంప్లీట్‌గా ఛేంజ్ కావడంతో ఫ్యాన్స్ పునకాలతో ఊగిపోతున్నారు. జస్ట్ ఫొటో లుక్కే ఇంతలా ఉంటే.. ఇక ఫుల్ యాడ్ వస్తే ఇక ఏ రేంజ్లో ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్లో హిట్ కొట్టింది. పార్ట్-2పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో పక్కా స్క్రిప్ట్ వర్క్‌తో రెడీ అవుతున్నాడు సుక్కు. బాహుబలి, కేజీఎఫ్ చిత్రాల తరహాలో ఎక్స్పెటేషన్స్ నెలకొనడంతో.. ఆ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ అన్ని సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.













