Allu Arjun: నేను చాలా సాధారణ వ్యక్తిని అంటున్న బన్నీ
అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతుంది. పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ మూవీస్ తర్వాత ఆయనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న బన్నీ, పుష్ప2(Pushpa2) తర్వాత మరో అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై అల్లు అర్జున్ ఫోటో రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
హాలీవుడ్ లో బాగా పేరున్న మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్(The Hollywood Reporter) ఇప్పుడు ఇండియాలో కూడా తమ మ్యాగజైన్ ను లాంచ్ చేస్తుంది. దాని ఫస్ట్ కాపీ కవర్ పేజ్ బన్నీ ఫోటోతో రావడం ఇప్పుడు విశేషంగా మారింది. అందులో బన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
బలం, ఆత్మ విశ్వాసం ఎప్పుడూ మన మనసులోనే ఉంటాయని, వాటిని ఎవరూ తీసేయలేరని, అవి పుట్టుకతోనే వచ్చిన క్వాలిటీస్ అని చెప్పాడు. ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా వినయంతోనే ఉండాలని చెప్తున్న బన్నీ, పుష్ప2 సక్సెస్ తర్వాత కూడా తాను ఓ సామాన్యుడినే అని చెప్తున్నాడు. అయితే షూటింగ్స్ లేనప్పుడు మాత్రం బన్నీ ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటాడట. అలా ఏమీ చేయకుండా ఖాళీగా ఉండటమంటే తనకెంతో ఇష్టమని తెలిపాడు బన్నీ. మొత్తానికి బన్నీని హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజ్ పై చూసి బన్నీ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి.













