Allu Arjun: వెకేషన్ మోడ్ లో బన్నీ
పుష్ప2(Pushpa2) సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి బాహుబలి2(Baahubali2) రికార్డులు బ్రేక్ చేసింది. పుష్ప2 అంత పెద్ద హిట్ అయినప్పటికీ బన్నీ మాత్రం ఆ సక్సెస్ ను సరిగా ఎంజాయ్ చేయలేకపోయాడు.
పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటన వల్ల బన్నీ పుష్ప2 విజయాన్ని సరిగా ఆస్వాదించలేకపోయాడు. దేశం మొత్తం పుష్ప2 సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటే బన్నీ మాత్రం తన గార్డెన్ లో ఏం పాలుపోక దీనంగా కూర్చునేవాడని బన్నీ తండ్రి అల్లు అరవిందే(Allu Aravind) ఓసారి ప్రెస్మీట్ లో చెప్పిన విషయం తెలిసిందే.
అయితే వాటన్నింటి నుంచి బయటికొచ్చిన బన్నీ ఇప్పుడు పుష్ప2 సక్సెస్ ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పుష్ప2 రిలీజైన వెంటనే బన్నీ వెకేషన్కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు కానీ జరిగిన సంఘటనల నేపథ్యంలో బన్నీ అవన్నీ మానుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అన్నింటినుంచి బయటపడి ఫ్రీ అయిన బన్నీ కొన్నాళ్ల పాటూ విదేశాల్లో తిరిగి అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి రావాలని వెళ్తున్నాడట.













