Allu Arjun: బన్నీ డెసిషన్ మార్చుకున్నాడా?
అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప2(Pushpa2) సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన విషయం తెలిసిందే. ఈ ఇయర్ రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ పుష్ప2 డీసెంట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుంది. ఈ సినిమా తర్వాత బన్నీ స్థాయి పూర్తిగా మారిపోయింది.
పుష్ప2కి కొనసాగింపుగా పుష్ప3 ర్యాంపేజ్(Pushpa3 rampage) కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమాను మొదలుపెట్టడానికి బన్నీ కాస్త టైమ్ తీసుకుంటాడని, మధ్యలో త్రివిక్రమ్(Trivikram) తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చింది. ఇలాంటి టైమ్ లో బన్నీ(Bunny) తన ఆలోచన మార్చుకున్నాడని తెలుస్తోంది.
పుష్ప2 బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో పుష్ప3నే ముందుగా పూర్తి చేయాలని బన్నీ అనుకుంటున్నాడట. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి పుష్ప3(Pushpa3)ని మొదలుపెట్టాలని డిసైడయ్యాడట. అయిత సుకుమార్ తన తర్వాతి సినిమాను చరణ్(Charan) తో చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా మొదలవడానికి ఎంతలేదన్నా ఏడాది సమయం పడుతుంది. ఒకవేళ బన్నీ తర్వాతి ప్రాజెక్టు సుకుమార్ తో పుష్ప3నే చేస్తే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలోనే వచ్చే అవకాశముంది. ఆడియన్స్ కూడా పుష్ప3 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.













