పెర్ఫార్మెన్స్ చూసి ఇచ్చారు.. పాత్ర చూసి కాదు
కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా జారీ చేసిన 69వ జాతీయ అవార్డుల లిస్ట్ లో ఉత్తమ నటుడు అవార్డు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన అల్లు అర్జున్‌కు దక్కింది. బన్నీ కంటే ఎంతో మంది నటులు, ఎన్నో మంచి పెర్ఫార్మెన్స్ లు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ ఒక్క నటుడికీ జాతీయ నటుడు అవార్డు వచ్చింది లేదు. అయితే పుష్ప లాంటి క్యారెక్టర్ ఉత్తమ నటుడు అవార్డా అని కొందరు అభ్యంతరాలు చెప్తున్నారు.
ఐతే ఇలాంటి పాత్రకు ఉత్తమ పురస్కారమా అంటూ కొందరు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. పుష్ప సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించాడన్న విషయం తెలిసిందే. లీడ్ రోల్ కాబట్టి హీరోలా ప్రెజెంట్ చేశారు కానీ వాస్తవానికి బన్నీ చేసింది నెగిటివ్ రోల్. స్మగ్లర్ క్యారెక్టర్ కు బన్నీకి అవార్డు రావడాన్ని ఇప్పుడు కొంత మంది తప్పుబడుతున్నారు. అయితే అవార్డులు ఇచ్చేటప్పుడు జ్యూరీ మెంబర్లు పెర్ఫార్మెన్స్ చూస్తారు తప్పించి అదెలాంటి పాత్ర అన్నది మాత్రం చూడరు. మంచి పాత్రలకే అవార్డులివ్వాలన్న రూలేమీ లేదు. సినిమాను సినిమాలా చూడాలి తప్పించి అలాంటి పాత్ర, ఇలాంటి పాత్ర అని చూడరు.
ఒక యాక్టర్, డైరెక్టర్ తనకిచ్చిన పాత్రను ఎలా ఓన్ చేసుకున్నాడు? ఎలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని మెప్పించాడన్నదే ఎవరైనా చూస్తారు తప్పించి అదెలాంటి పాత్ర అన్నది ఎవరూ చూడరు. విమర్శకులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని బన్నీకి ఇచ్చిన పురస్కారాన్ని గౌరవిస్తే బాగుంటుంది.













