ఓకే అయిన ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టిన అల్లు అర్జున్?
ఒక స్టార్ హీరోకి కథ చెప్పి దాన్ని ఓకే చేసుకొని సెట్స్ కి వెళ్లే దాకా ఏ డైరెక్టర్‌కైనా, ఏ నిర్మాతకైనా నమ్మకం ఉండదు. ఎందుకంటే కోట్ల రూపాయల వ్యవహారం, మరో పక్క స్టార్ హీరో ఇమేజ్‌కి, కెరీర్‌కి సంబంధించిన విషయం. దీంతో ఏ క్షణంలోనైనా ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు దిల్‌రాజు. అతని బేనర్లో ఆర్య, పరుగు వంటి సూపర్‌హిట్ సినిమాలు చేశాడు బన్నీ. పరుగు రిలీజ్ అయి దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది. మళ్లీ బన్నీతో సినిమా చేయాలని దిల్‌రాజు ఎంతో ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. వేణుశ్రీరామ్ డైరెక్షన్లో `ఐకాన్` పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్టు ఆమధ్య ప్రకటించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్‌ని బన్నీ పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది.
ఎందుకంటే అల వైకుంఠపురములో తర్వాత సుకుమార్ కాంబినేషన్లో పుష్ప స్టార్ట్ చేసేశాడు. ఆ సినిమా తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో సినిమా చెయ్యబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు కూడా. కానీ, ఐకాన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్నిబట్టి చూస్తే బన్నీకి దిల్‌రాజు బేనర్లో సినిమా చేసే ఉద్దేశం లేనట్టుగా అనిపిస్తోంది. దిల్‌రాజు మాత్రం బన్నీతో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వేణు శ్రీరామ్‌తో ఓ మై ఫ్రెండ్ అనే ఫ్లాప్ సినిమా, ఎంసిఎ అనే సూపర్‌హిట్ సినిమా చేశాడు దిల్‌రాజు. తాజాగా బన్నీ కోసం అతను చెప్పిన ఐకాన్ కథ దిల్‌రాజుకు బాగా నచ్చిందట. డెఫినెట్‌గా వర్కవుట్ అయ్యే ప్రాజెక్ట్ కావడంతో ఎంతో పట్టుదలగా ఉన్నాడు. కానీ, బన్నీ మాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు. అయితే దిల్‌రాజు ఈ సినిమాకి మరో ఆప్షన్ కూడా పెట్టుకున్నాడు. బన్నీ ఓకే కాకపోతే ఇదే స్ర్కిప్ట్‌తో రామ్‌చరణ్‌ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాడు. మరి అల్లు అర్జున్ హోల్డ్‌లో పెట్టిన కథతో రామ్‌చరణ్ సినిమా చేస్తాడా లేదా అనేది పెద్ద డౌట్. మరి ఈ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు ఎలా సెట్ చేస్తాడో చూడాలి.













